Sunday, January 27, 2008

నీకే ఒదిలేస్తున్నా

చిలిపి గా మొదలయిన చిరు స్నేహం
అయ్యింది మెల్లగా మాధుర్యాలా మమతల లోకం
పలకరింతల పెనవేత లో
మారింది మరో రూపం
అని భ్రమసే లోగా చివరికి రానుంది
వీడిపోయే తరుణం
ఏమో ఏమగునో చివరికి ఈ అనుబంధం
స్నేహమనే బంధం గా మిగులునో
లేక అపరాధిగా నను నిలుపునో
ఒహ్ అందుకే నేస్తమా
నాలోనే దాచుకున్నా నా భావం
కాని నను బలవంత పెట్టి
వెలికి తీసేవు నాలోని దుఖం
విని అయ్యావు చివరికి నాకు దూరం
కాని మరువలేను నిను కలకాలం
కాను దూరం అని ఒదారుస్తావో
లేక ఇలా నను ఒదిలేస్తావో
నీకే ఒదిలేస్తున్నా నిర్ణయం

3 comments:

Anjali said...

kaalam kadu kaThinamainadi
manasu gODu vinalEdadi

nEnekkina oohala uyyala
oopEnadi okasaariTU okasaaraTu

anyaayam idi aapamannaanu
aTu chivara santasam vadda aagamannaanu

kaalam eppaTilaa navvindi
sandhya lEni ushOdayam lEdandi
saagaram chErani nadulu lEvandi
needa lEni velugu lEdandi
vaaDipOni puvvu lEdandi

kaalam kaDu dayalEnidi
niyamamepuDu tappalEdadi...


Anjali

Usha said...

నమస్తె Anajali.
కాలము నియమము తప్పిన్ది అనలేదు మన రాతే ఎలా జరగాలని ఉన్నా జరగక మానదు అని నా అభిప్రాయము
మీ బాధ తీరుతున్దొ లేదొ తెలిదు కాని మీరెదొ బాధలొఉన్నారని మాత్రము అనిపిస్తున్ది నిజము అవ్వొచ్చు కాకపొవచ్చు.

Thanks
Usha

Pranav Ainavolu said...

ఉష గారు, చాలా బాగుంది... అచ్చం నా మనసు కథలా ఉంది. నా జీవితాన్ని చూసి రాసారా అనిపించింది చదవగానే.
కలిసేది విడిపోవడానికేనా?
స్నేహానికి చావే అంతమంటారే? అన్నీ ఉత్త మాటలేనా?
మనల్ని మనం మోసం చేసుకోవడానికి అందమైన అక్షరాల జిగిబిగి అల్లికలో సృష్టించుకున్నవేనా ఇవన్నీ... అనిపిస్తుంది.
కొద్ది రోజుల్లో విడిపొతాం అన్న విషయం ముందే తెలిస్తే మనసుపడే వేదన, రోదన వర్ణనాతీతం.
అప్పుడప్పుడూ ఇది స్నేహమా... కేవలం స్నేహమేనా అన్న అనుమానం కూడా వస్తుంది.
కుల, మత, జాతి, వర్ణ ఇనుప చట్రాలలో బంధీలై, కేవలం కట్టుబాట్ల పరిరక్షణే జీవన ధ్యేయంగా బ్రతికే ఈ జనాలను వంద శ్రీశ్రీలు కూడా మార్చలేరనిపిస్తుంది. వీరు కవితలకు స్పందించారు, వాస్తవాన్ని గుర్తించారు. తిలక్ గారు చెప్పినట్లు తోకలు తెగిన ఎలకల్లా కలుగుల్లోనే తిరుగుతుంటారు. ఇది అప్రస్తుతంగా అనిపించొచ్చు. కాని ప్రస్తుతమే, అంతరాల్లోని మనస్సులు విడిపోవడానికి కారణాలు దాదాపు బాహ్య ప్రపంచం నుంచే అయ్యి ఉంటాయి. కొన్ని జీవితాల్లో ఇవే గొడ్డలి పెట్టులా మారుతుంటాయి.
ఇవన్నీ తెలిసి తప్పంతా తనదే ఐనట్టు... 'నీట ముంచినా పాల ముంచినా... ' అని తనకే వదిలేయడం నా విషయంలో తప్పనిపిస్తుంది.