Saturday, February 9, 2008

కలలా కలిసేవు

కలలా కలిశావు కమ్మని గురుతుగా
మిగులుతావు అనుకున్నా కమ్మని కలగా
కల ని నేను కమ్మని గురుతునెలా
కాగలను అని మగతలోనే జారిపోయేవు
జారినావని లేదు చింత
ఎందుకంటే ఎప్పటికయినా
జారల్సిన వాడివే కనుక
ఐనా ఎందుకో జారిపోతుంటే
జారుతున్నాయి కనులనుండి
ఆగని కన్నీటి తెరలు
జాలువారి పడుతున్నాయి
చెక్కిలమ్మని వోదార్చుతూ

Tuesday, February 5, 2008

ఎందుకు కలిశావు

ముందు తెలియదు నీ పరిచయం
ఎలా మారుతుందో కాని
మారేవు ఈరూపం గా

కలలోలా కలిసేవు
కన్నులలో నిలుస్తున్నావు
కరిగిపోతావు అని తెలుసు
ఐనా ఆశ పడుతున్నాను
ఎందుకో తెలీదు మరువలేకున్నాను
మార్చుకోలేకున్నాను
తనువర్పించాలని ఉన్నా
మనసు మాత్రమే ఇవ్వగలను
ఎందుకు కలిశావు
చివరికి ఇలా వొదిలి పోవలనా..
నను వీడిపోయే తరుణం ఉందన్న నిజం
తెలిసి కుడా వోదలలేని ఈ స్థితికి తెచ్చేవు
ఏమయిపోతానో నాకే అర్ధం కాకున్నది
ఏమికానని మనసు మొండిగా చెప్తున్నది
ఏదైనా కాలమే చెప్తుంది చివరకు

Monday, February 4, 2008

మధుర బంధమా

మాట్లాడకు అన్నంత మాత్రాన
మరిచి పోతానని అనుకున్నావా ...
మరు జన్మకై నేను వేచి యున్నాను.
మిగిలిన ఈ రోజులు మ్రింగ లేకున్నాను.
ముచ్చటైన మన కలయిక మరువలేకున్నాను..
నేను నిన్ను మరువలేను.
మరువలేని నేస్తమా
జన్మల బంధానికి ఎదురు చూపు తప్పదమ్మా
మాటలే లేనప్పుడు మౌనమే భాషా
అందుకే ఈ మౌనం అంటున్నా
కాదనలేవు గా మధుర బంధమా