Saturday, February 9, 2008

కలలా కలిసేవు

కలలా కలిశావు కమ్మని గురుతుగా
మిగులుతావు అనుకున్నా కమ్మని కలగా
కల ని నేను కమ్మని గురుతునెలా
కాగలను అని మగతలోనే జారిపోయేవు
జారినావని లేదు చింత
ఎందుకంటే ఎప్పటికయినా
జారల్సిన వాడివే కనుక
ఐనా ఎందుకో జారిపోతుంటే
జారుతున్నాయి కనులనుండి
ఆగని కన్నీటి తెరలు
జాలువారి పడుతున్నాయి
చెక్కిలమ్మని వోదార్చుతూ

4 comments:

Anonymous said...

బాగానె వున్నాయి కాని ఏవరి కొసం

pruthviraj said...

కరిగే కర్పూరం లా చేరిపోయావు నా మదిలోన
చెదరని జ్ఞాపకాల వల వేసావు నా హృదయాన
కన్నుల్తో వెంటాడి కల ల్లో నిలిచి పోయావు
మాటల్తో పోట్లాడి మది సైతం దోచావు
జీవన సంధ్యలో కొయిల రాగమై కూసావు
పావన ధరిత్రి పి నా కొసం వెలిసావు
కదిలే మబ్బుల్లా నువ్వలా విడి పోతుంతే
కురిసే వర్షంలా నా మది కన్నీరు పెడుతున్నది
చెక్కిల్ల పై నీ కన్నీల్లను చూసి
నా మది లోని హృదయం జారిపోతున్నది
నా మనసు జాడ నాకే తెలియకున్నది.

Unknown said...

bavundi ... manchi feel undi ..

Usha said...

Thanq Avinaash
meeru blog creat cheyyaledaa?

Thanks
Usha