Tuesday, February 19, 2008

దేవా నీ తీర్పేంటి

కనలేదు ఏ తియ్యని కమ్మని కలలు

కోరుకోలేదు అతిగా ఏ కోరికలు

చిరు ప్రేమ తో నన్ను నన్ను గా ప్రేమించే చిన్ని మనసున్న

మనిషి ఆయితే చాలు అనుకున్నా

ఓ భగవంతుడా అది కూడా అందుకోడానికి తగనా

సరే లే నా అదృస్ఠము ఇంతే అని సరి పెట్టుకుంటున్నా

కూడా ఇంకా నన్ను ఎందుకిలా ఏడిపించాలని

నీకు ఇంత ఆనందము ఆది నా పూర్వాజన్మ లో

చేసుకున్నపాపము అని సరిపెట్టుకోవాలి

అంతే నా ఇదే నా నీ తీర్పు దేవా

దీనికి ముగింపు నా అంతమేనేమో

ఇదేనా నువ్వు చేసే తీర్పు ?

Sunday, February 17, 2008

తోడు లేని వంటరి

తోడు లేని వొంటరిని కాలానికి చెందనిదాన్ని
భావాలకి అనుభవాన్ని కోరుకునే రకాన్ని
దొరకదు తోడు జీవితాంతము మిగిలే
జ్నాపకాలైనా కావు తీపి మధురాలు
దొరికిన మాధుర్యాలు తీపిగురుతులు కాజాలవు
సమాజపు భయాల నీడలో
తప్పదు ముగింపు ఈ నిరాసా నిశీధిలో
ఆదరింపబడలేను ఇక ఈ జన్మలో
పొందలేను తోడు ఈ వంటరి బ్రతుకులో
అందజాలదు నాకిక ఈ చరమాంకములో
కాదని అందుకోవాలనుకున్నా
అందుకునే స్నేహము తో కూడిన
ప్రియ హస్తము దొరికే జాడ లేదు
ఇంతే ముగింపు కడవరకు