Friday, January 25, 2008

సాయీ సాయీ సాయీ....

ఏమి సేతు బాబా నీ నామం
ఎటుల పలుకుదు
పలికే కొలది కలుగును
ఆరాధనా భావం మధురిమల సాయీ నామం
పలికితే చాలు మనసులొ
మేదిలేను కమ్మనీ భావం
సాయీ సాయీ సాయీ .... ( ఏమి సేతు )


కలతల జీవికి కలిగిస్తావు
కమ్మని ఆశా దీపం
మనసే లేని మనిషిని కూడా మారుస్తావు
మనసున్న మనిదీపం గా
రానివ్వవు ఏ వెతలని నీ భక్తులకు
తోడుగా ఉంటావు ఎప్పుడూ మనసుల్లో
సాయీ సాయీ సాయీ .... ( ఏమి సేతు ..)


ద్వారకలోను ఉన్నవనుకుంటే
లేదు మీలోనే ఉన్నానని అంటావు
షిరిడి వాసివి అనుకుంటారు కాని
మీ మదిలో నివాసిని అనిపిస్తావు
నమ్మిన వారిని దీవిస్తావు
నమ్మని వారిని నమ్మిస్తావు
సాయీ సాయీ సాయీ.... ( ఏమి సేతు )

నిను వేడుకుంటున్నా

దొరకనివి కోరుకుంటాము
ఆ కోరుకోవటములో తప్పటడుగు కి
కుడా వేనుదీయం
కాబట్టి నేస్తమా దొరకనివి
మరల మరల గురుతు చేయకు
తప్పటడుగుకి తావివ్వకు
నిను వేడుకుంటున్నా మనసారా
గడిచిపోతున్న బ్రతుకు కి
అలవాటు లో పడిపోయాను.
మారని, మారలేని జీవితాన్ని ఆశించను
మనసు పొరలలో దాచుకున్న బాధను
అనుభవిస్తూ గడిపేస్తున్నా
కొత్త చిగురులోద్దు అనుకుంటున్నా
సమయం మించిన తరుణం లో పడిపోయాను
కాలేను కన్నకడుపు కి దూరం
కలిగించలేను వారికీ నాపైన రోత
నేస్తమా నన్నిలా బతకనివ్వవా??....

Thursday, January 24, 2008

సదా కోరుతున్నా

""అవుతానో కానో తెలీదు
నిజమైన కవయిత్రిని
కాని పొందుతున్నాను
మీ అందరి ఆదరాభిమానాలని
ఇలా ఉండాలి కలకాలం
అని సదా కోరుతున్నా
ఆ సాయి నాధుని
నిలుపుకోవాలి అని ఆశిస్తున్నా
నా మనస్సుని
గర్వమనే గాలి అహం అనే ధూళి
సోకవోద్దని ప్రార్ధిస్తూ
ఈ సంతృప్తి చాలు దేవా కడదాకా
అనుకుంటున్నా "

ఎవరికి ఎవరం

" జీవితం లో ఎవరికి ఎవరం కాము
అనుకుంటూనే అవుతున్టాము
తెలీని దగ్గర తనం తో
అనుకోని బంధాలు స్నేహాలు
కలుపుతున్నాయి ప్రతి ఒక్కరిని
అందులోనే వెతుక్కుంటాము
మనవాళ్ళని స్నేహం కోసం ఒకరైతే
బంధం కోసం వేరొకరు
ఇలా కలుపుకుంటూనే ఉంటాము
కడ దాకా కాదనగలవా ? "

Tuesday, January 22, 2008

సాలెగూడు

మనసులోని భావం
మదిలోనే ఆగిపోతుంది
సంఘం లోని కట్టుబాట్లకి.
పురివిప్పిన నెమలిలా
తెలుపాలని అనిపిస్తుంది
కాని ఎక్కడో ఆగిపోతుంది
ఈ సంఘమనే సాలె గూడులోంచి
బయటికి రాని ఈ మనస్సు
పలుక లేక మూగవోయింది

Monday, January 21, 2008

స్నేహానికి అర్ధం

స్నేహమంటే వివరణ లేనిది
వర్ణన లేనిది కవితకి కుడా అందనిది
ఐనా ఎంతో విలువైనది కదా
ఆ స్నేహ హస్తం సదా ఉంటుందని
ఆశిస్తూ నా స్నేహ హస్తాన్ని
ఇస్తానని మాటిస్తూ
నీ నవ్వుల నెచ్చెలి

మౌనంగా

కిరణం లా మేరవాలనుకున్నా
కాని మబ్బు ఆపింది
నీకెందుకే వెలుగని
గీతాన్ని అవ్వాలనుకున్న
రాగమంది నీవు సరితూగవని
హాసినిలా ఉండాలనుకున్న
ఉండనివ్వనని చెప్తుంది జీవితపు బాట
శుభాషినినే అనుకున్నా కాని
నాకంటే భాషినులున్నారని మూగబోయా
కాని ముత్యాన్ని కాకపోనా అని
ఆశతో బ్రతుకు పయనం సాగిస్తున్నా
కాదనలేక మౌనంగా

కాదనగలవా

చెప్పలేము నిజమైన స్నేహానికి అబద్ధం
దాచలేము ప్రియ మిత్రుల ముందు తప్పుల భావం
అది ఉంటేనే అవుతుంది నిజమైన మిత్రత్వం
లేకుంటే అవుతుంది కనిపించని దూరాల తీరం
కాదనగలవా ఒ నిజమైన నేస్తమా

నా కలత

ఏమిటో ఈరోజు మనసు
కలతలో పడింది
నేస్తమా ఎప్పుడు నీ రాక అని
ఎదురు చూడలేక
మనసు కలత చెందుతుంది
వొంటరిని చేసి మది
నీ వెంటే వొచ్చేసింది
నీవులేని మాటలు నాకెందుకు
అని మూగపోయింది నా కంప్యూటరు
నిన్ను బాధపెట్టాలని కాదు మిత్రమా
నాలోని బాధ వెలికి తీస్తే
నీ మోము చిన్న బోతుందేమో అని
కాని అంతలోనే చిరు బాధ
నా కంటి నుండి జారి పోతుంటే
ఆగమనలేక ఆపుకోలేక రాసుకున్నా
చిరు కవితలో నా కలత
తీరునేమో అని ఆశగా

Sunday, January 20, 2008

దీరువు

ఓదార్పు కోసం నీ దరి చేరితే
తిరిగి నీకే ఓదార్పు నవ్వాలని భయము
కనుచూపు లలో ఉండాలంటే ముందు
నేను కనురెప్పని కావాలి
కాని కాలేను కంటి చూపు లేని దాన్ని
నీకేమి చూపునవుతా
అని అక్కడే ఆగిపోయింది
కలహంస కదలికే లేకుండా
చిరునగవు మోముతో
చెదరని దీరువులా
చల్లని చూపులతో

అలిగేవా చందమామా

నువ్వలిగావని నేను అలోచించనా
లేక అలుకలోనే నా నేస్తాన్ని వెతకాలని చూసి
అలుకలో ఎంత బాగున్నావో అని ఊహించుకోన
అలిగిన వేళ సాగరం అలలలనే మరచి
అనంత లోతుల్లో దాగుండు నని
వెతుకులాడిన నా కనులలో
నీ రూపు కడలి తరంగం లా
చల్లని వెన్నలలో సంద్రం లో
చందమామ నీడలా కదలిందని
కనుగొన్నానని చెప్పనా
ఆ అలుకలో నా నేస్తం
చందురుని చందం
అని మురిసిపోనా ?