Monday, January 21, 2008

మౌనంగా

కిరణం లా మేరవాలనుకున్నా
కాని మబ్బు ఆపింది
నీకెందుకే వెలుగని
గీతాన్ని అవ్వాలనుకున్న
రాగమంది నీవు సరితూగవని
హాసినిలా ఉండాలనుకున్న
ఉండనివ్వనని చెప్తుంది జీవితపు బాట
శుభాషినినే అనుకున్నా కాని
నాకంటే భాషినులున్నారని మూగబోయా
కాని ముత్యాన్ని కాకపోనా అని
ఆశతో బ్రతుకు పయనం సాగిస్తున్నా
కాదనలేక మౌనంగా

1 comment:

nike said...

ఒక మనిషి మనసులోని సంఘర్షణని కవితాత్మకంగా చాలా చక్కగా ఆవిష్కరించారు. మబ్బు, రాగం , జీవితపు కట్టుబాట్లు ఇవన్ని తాత్కాలిక అడ్డంకులు మాత్రమే అని , రేపు ఆశ తో బతకాలని చక్కగా చెప్పావు.