Thursday, June 3, 2010

తోడుకొసం

మనసు చెదిరితే మాట బాధ అవుతుంది
కనులు చెమ్మగిల్లితే కవితగా పలుకుంది
వసంతం కోసం కోకిల యెదురు చూస్తుంది
నీకొసం నేనున్నాననె తోడుకొసం ప్రతీ మదీ ఆశిస్తుంది
ఆ తోడె ఇక అడియాస అయితే యేమి సాధిస్తుంది
మానవ జీవితం యెలా గదుపుతుంది చివరి క్షణం

Wednesday, June 11, 2008

ఏకాంతం లో

చిరు గజ్జెల చప్పుడు మురిపిస్తుంటే
ముంజేతి గాజులు ఘల్లు మంటుంటే
ముంగురులే ఫాలాన్ని మృదువుగా స్పృసిస్తుంటే
చిరుగాలికి సరిగంచు రెప రెప లాడుతుంటే
నింగీ నేలా కలిసే చోట సాగర తీరాన
నే తడి ఆరని పాదాలతో
ఎవరూ లేని ఏకాంతం లో
తనివి తీరా చిన్డులెయ్యాలని ఆశ
తీరేనా నా ఈ పాశ

Tuesday, June 10, 2008

మనసు లో ఊహ

ఏ గానం విన్నా మనసు కోరుతుంది
ఒ గాయనిలా పాడాలని
ఏ నాట్యం చూసినా తనువు పులకిస్తుంది
నాట్య మయూరి లా ఆడాలని
ఏ చిలిపి చేతలు చూసినా
మనసు ఊహిస్తుంది
కన్నెలామారిపోవాలని
ఏవి లేని రాని తీరని మోడుకి
రాదిక ఈ జన్మకి ఈ ఆనందలహరి