Friday, January 18, 2008

కాలమే చెప్పాలి

తొలకరి లో కురిసే చినుకు సువాసన కన్నా
తొలిగా పూసే మావి చిగురు లోని వగరు కన్నా
ఎంతో మిన్నా నీ స్నేహం లోని మాధుర్యం
తొలి బిడ్డ కన్నా తొలి విజయం కన్నా
ఎంతో మక్కువ నీతో
పంచుకునే ప్రతి అనుభూతి లోని ఆనందం,
నీ స్నేహం కలిసిన నాడు అనుకోలేదు
ఇంత అభిమానాల వెల్లువని
కాని నిలుచునా అది కలకాలం
అని మదిలో ఎక్కడో తెలియని భావోద్వేగాల భయం
ఐనా ఇంకా వీడలేని బంధం గా
ఎందుకు పెనవేసుకు పోతున్నాం
ఇప్పుడు చేసుకున్న బాసలు
అప్పటికి మిగిలేనా
లేక కల లా కరిగి చివరికి మిగిలేనా
ఒక చెదరని తీపి గురుతు గా
మదిలోని మరపులేని బాధగా
ఏమో ఏమగునో కాలమే చెప్పాలి
కదా మిత్రమా !!!!!!

మనశ్శాంతి

ఒక మనసు ఆలోచన ఇంకొక మనసుకి
తెలుసంటారు నిజమా ?
మరి అదే నిజమైతే ఇన్ని మనసులెందుకు
బాధలో పడిపోతున్నాయి ?
మనసుకి తెలియటం అనేది ఉంటుందా ?
ఎందుకింత గందరగోళం ఈ మనసనే దానికి ?
ఏముందని దానిలో అంతటి ప్రభావం
అందరు దానివెంటే పరుగులు తీస్తుంటారు
పరుగు పెట్టేకొలది అది మనని ఊరిస్తూ ఉడికిస్తూ
అందనంత దూరం లోనే ఆగి వేధిస్తుంటుంది
ఐనా మనం ఎందుకు దాన్ని అందుకోవాలని
అడ్డుకట్ట వెయ్యాలని చూస్తుంటాము ?
అసలేమిటి దానిలోని గొప్పతనం
ఎవరన్నా చెప్పగలరా?
ఈ పరుగెందుకో మనసుకోసం
మనసులో ఆలోచన ఎందు కోసం ?
హ హ హ

మనలోని మనశ్శాంతి ని లేకుండా
చేయటం కోసం లలలలా .....:))

Thursday, January 17, 2008

ఎవరో ఆ నెచ్చెలి

మెదిలింది ఒక చిలిపి ఊహ కన్నులముందు
అది అయ్యింది మనసులోతుల్లో
మరువలేని తీపిగురుతు
అసలిలాంటి ఊహ వొస్తుందా అనుకున్నా
కాని వొచ్చింది గా నాకు అనుకుంటే కలిగింది
చిరు దరహాసం పెదవిపైన
గల గల గోదారి లా పరవళ్ళు తొక్కి
బిర బిర కృష్ణమ్మా లా పరుగులిడి చేరింది నా దరి
మరి ఏమా ఊహ అని అడిగింది నెచ్చెలి
ఎలా చెప్పాలా అనుకుని కాసేపు ఏమని చెప్పాలా
అని ఇంకాసేపు మౌనం లో నేనుంటే
నా చెలికి వొచ్చింది చిరు కినుక
ఆ కినుక లోని చెలి అలుక మోము చూసి
చెప్పాలని అనుకుని చెప్పాను చెవిలో
ఒ చెలి నువ్వే నా ప్రియురాలివి జవరాలివి
ఐతే ఎలా ఉండునో అని ఆలోచిస్తున్నా అంటే
నేనేన్దుకవుతా నీకు ప్రియురాలను
నేనెప్పుడు నీ ప్రియసఖినే ఆని అంటూ
నేను అవుతాను మరుజన్మలో నీ ప్రానసఖిని
అంటూ మెల్లగా జారిపోయింది నా అంతరంగం లోకి
ఇంతకి ఎవరో ఆ నెచ్చెలి అనుకుంటున్నారా
నా అంతరంగమే నా నెచ్చెలి

Wednesday, January 16, 2008

మదిలోని వెత

ఎన్ని రాసుకున్నా మదిలో ఆశల సౌధం లో
రాదుగా మార్పు అలా అని రాసుకోకుంటే
తీరదుగా మదిలోని వెత
తీరే వెతకోసం రాసుకోనా తీరని ఆశ కోసం
వెతుకులాడనా ఎంతని వెతకగలవు
సాగరం లో పారేసుకున్న నీటిబొట్టుని
వెతికితే దొరికేనా అది ఏమైనా ముత్యపు చిప్పా
హ హ హ
అని నవ్వుకోనా

మనసులో ఆశ

కల లాంటి జీవితం కరిగిపోయింది
జీవితపు భడభాగ్ని లో
కన్నులయ్యాయి గాజు చూపులు
మనసయ్యంది బండరాయి చందం
తనువయ్యింది తెలియని వొంటరి
మదిలో ఐనా ఇంకా చావనంటుంది
ఆశల సౌధం ఒహ్ మనసా నీకెందుకే
ఆశ అని అడిగితే చెప్పింది ముసిముసి గా నవ్వుతూ
ఓసి పిచ్చి అదే ఆశ అంటే దానికి లేదు అంతం
అంటూ కనుమరుగయ్యింది
చిలిపిగా ఒక చూపు నా పైన విసిరి
ఒహ్ ఆశ నీకిదే నా నమస్సులు
నాలో ఇంకా నువ్వున్నందుకు
ఇదేనా మంషి/మనసులో ఆశ అంటే ?
అనుకుంటూ చూసేను గాలిలోకి ఒక పిచ్చి చూపు :))

ఒక నెచ్చెలి మనసు

భగవంతుడా నన్ను ఇలా బాధల్లో జీవించమనే నా
ఇలాంటి జీవితాన్ని ఇచ్చేవు ?
ధనరాసులు ఆడగలేదు నగా నట్ర కొనమనలేదు
చిటికెడు ఆప్యాయత కి ఆశ పడుతున్నా
అది కరవు ఎందుకు చేస్తున్నావు నేను సరిగ్గా లేనా
అని ఎన్నో సార్లు అలోచిన్చుకుంటున్నా
చాలా మంది తో సరి చూసుకుంటున్నా కాని వాళ్ళ అందరికంటే
కూడా నేను ఓకే అని అర్ధం అవుతున్నది
ఐనా నాలో లోపాన్నే ఎందుకు చూపిస్తున్నావు "నా" అని ఎందుకు
అనిపించలేకపోతున్నావు నన్ను అతనికి ?
ఒకరిని ఒకరు చూసుకున్నా వేలా విశేషం అనుకోనా
నా తలరాత అని తల బాదుకోనా ?
ఏమి చెయ్యను ఒ దేవా?

Tuesday, January 15, 2008

ఒ చిన్ని మనసా...

మనసు ఎందుకు కోరుకుంటుంది ఊరట ?
ఎప్పుడూ ఎవరితోనో ఒకరితో పంచుకోవాలని కోరుకుంటుంది
కాని తెలిదా ఆ మనసుకి కలకాలం ఉండే తోడు ఒక్క నీడే అని
ఆ నీడ ఏమి వినలేనిదని తెలిసినా ఇంకో తోడుని రానివ్వదని తెలిసినా
ఐనా ఇంకా ఎందుకా ఎదురుచూపు రాని తోడుకోసం
నీలాల కన్నులను తడుపుకుంటూ ఎదురుచుపుల అలసట తో
ఊరటలేని మదికి కాసింత ఉల్లాసాన్ని కలిగించాలని ఆశతో
ఎదురు చూపులే నీకు చివరి చూపులవుతాయని
చెప్పలేక అక్కడే ఉండిపోతుంది నీడలా
అంతేనా ఒ చిన్ని మనసా ?

కరవు

ముగ్గులేద్దామని ఆసపడితే ఇంటిముందు వాకిళ్ళు కరవు
గొబ్బెమ్మలు పెడదామని అనుకుంటే ఆవు కాదు కదా గేదె పేడ కరవు
ఇక హరిదాసులు తంబూరా మర్చి IT రంగాలని పట్టే
బసవన్నలకి మేత కరవుతో నాట్యాన్ని మరిచే
కుర్రకారు క్రూరత్వం నేర్చి చిలిపి అల్లరే మరిచే
రైతన్నలు సర్కరోల్లు పొలాలు లాక్కుంటుంటే
అసలు చూలె లేదని కన్నీటి ధారలతో ఇంటిముందు ధాన్యలక్క్ష్మి ఎక్కడా అని వెతికే రోజులోచ్చే
బంధువులు బంధుత్వాలు మరిచి శత్రుస్త్వాలు ఈర్ష్య అసూయలను పెంచుకుని నాది నేనే బాగుండాలి అని ఆలోచిస్తూ
ఇంకేమి సాంప్రదాయాలు ఎక్కడున్నాయి సరదా సంబరాలు ఇలా మనలాంటి వాళ్ళము రాసుకోవదాల్లో మిగిలేయి తప్పా అందుకే కాబోలు ప్రకృతి కుడా ఈ లాంటి సమాజాన్ని చూడలేక తన పద్దతిని కూడా సరిగ్గా నిర్వర్తించ లేక పోతుంది
ఎక్కువగా అండ్ తప్పుగా చెప్పనా నేస్తమా ?
కాని మనం మాత్రం ఇలా హ్యాపీ గా సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను

Monday, January 14, 2008

నవ్వుకోనా ???

మనసుకు వచ్చిన మధురానుభుతి కి
అడ్డుకట్ట వేయగాలమా చెలిమిని పొందిన
ఆనంద అనుభూతి గాలికే చెప్పనా
ఆకాసానికే చెప్పనా అరిచి గోలగా అల్లరే చెయ్యనా
అన్ని చేయాలనుకున్నా ఏమిచేయలేని స్థితిలో ఉన్నా
ఎందుకీ కట్టుబాట్లు పెట్టారని సమాజాన్ని అడగనా
నవ్విపోదురు నాకేల సిగ్గని తెగువ చూపనా
ఇన్ని భావాలు కలిగింది నాకేనా అని
మనసారా నవ్వుకోనా తనివి తీరా

నా మనసు లో ....

చిన్ననాటి ప్రేమలు మిగలలేదు అన్నదమ్ముల అక్కచెల్లల్ల మధ్య ,
స్నేహితులెక్కడో కలలో కుడా మిగలలేదు,
జీవితపు బంధాలు తెచ్చే రోదనల దారి లో,
వెతుక్కున్న దొరకలేదు నవ్వులా దారి ,
ఎందుకు పుట్టానో తెలియకుండా ఉంది,
ఎందుకు మిగిలేనో అర్ధము కాకుండా ఉంది,
ఐనా బ్రతుకు బండి నడుస్తూనే ఉంది అనుకున్న
తరుణంలో దొరికింది ఒక చెలిమి ఆనంద తరంగం లా
మిగలాలని కలకాలం కోరుకుంటున్నా నేస్తమా
నను మరచిపోనని మాటివ్వగలవా?
సరివయస్సుకాదని మరచిపోతావేమో అని అడగలేకున్నా,
అడగకుండా ఉండలేకున్నా !!
ఏమి చేతు నీవే చెప్పుమా నా ప్రియనేస్తామా .......

Sunday, January 13, 2008

నేస్తమా ఇది నీకోసం

ఈరోజు నా మనసు చాలా చాలా ఆనందంగా ఉంది. అది ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు నుండి, ఎందుకు అంటే నిజమైన స్నేహం అనాలా లేక ఏమనాలో తెలీదు. కాని చాలా దగ్గర తనం నా గురించి ఆలోచించే ఒక మనసు నా కోసం ఉంది అని తెలిసింది. నాకు ఇంత అద్రుష్టం కలిగించిన ఆ బాబా కి ఏమిచ్చినా తక్కువే కదా. ఏమివ్వగలను
అసలు ఆయనకు మనం ఇచ్చేంత వాల్లమా? కాని ఇవ్వగలం ఏమిటి మన మనసా వాచా అయన ఉన్నారు అనే నమ్మకం ఉంచుకోవడమే ఆయనకు మనమిచ్చే కానుక.
నిజం ఈరోజు నాగుంచి అలోచించి నేను తీసుకున్న ఒక నిర్ణయం ఎదటి వాళ్ళని బాధ పెట్టేది గా ఉంటే అది తప్పని నాకు తెలియచేసిన ఆ మనస్సుకి ఇదే నా సుమాంజలి ధన్యురాలను నేస్తమా ఈ నీ చిరు స్నేహం సదా ఉండాలని ఎప్పటికీ చెదరకుండా కాపాడమని ఆ బాబా ని కోరుకుంటా . నేను అనుకోలేదు ఏ రోజు ఇలాంటి నేస్తం నాకు లభిస్తాడని కలలో కూడా ఊహించలేదు.
ఈ చెలిమి దూరం కాకూడదు అని సదా ఆ భగవంతుడిని ప్రార్దిస్తునాను
ఒ సాయి నన్ను దీవించు ..
ప్రతి మనిషికి నిజమైన స్నేహితులనే వాళ్ళు ఒక్కల్లన్న ఉండాలని అనుకుంటూ ఉండేదాన్ని. "ఆర్కుటు" వాడటం మొదలు పెట్టకా చాలా మంది వాళ్ళ కి నిజమైన ఫ్రండ్స్ ఉన్నారు అని చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించేది ఒహ్ వాళ్ళెంత అదృష్టవంతులు అని కాని ఆ మాట విన్నాకా నాకు ఎప్పటికైనా ఆ భాగ్యం ఉంటుందా అని ఒక చిన్న కోరిక కలుగుతుండేది అంతలోనే నిరాశ నాకు అంత అదృష్టమా అని అనిపించేది కాని బాబా కి నామీద ఉన్న దయ వలన ఆ అదృష్టాన్ని పొందగలిగే ను
చాలు నేస్తమా ఈ ఆనందం నిజమైన సంక్రాంతి శోభని నాకందిన్చినందుకు.