Friday, January 18, 2008

మనశ్శాంతి

ఒక మనసు ఆలోచన ఇంకొక మనసుకి
తెలుసంటారు నిజమా ?
మరి అదే నిజమైతే ఇన్ని మనసులెందుకు
బాధలో పడిపోతున్నాయి ?
మనసుకి తెలియటం అనేది ఉంటుందా ?
ఎందుకింత గందరగోళం ఈ మనసనే దానికి ?
ఏముందని దానిలో అంతటి ప్రభావం
అందరు దానివెంటే పరుగులు తీస్తుంటారు
పరుగు పెట్టేకొలది అది మనని ఊరిస్తూ ఉడికిస్తూ
అందనంత దూరం లోనే ఆగి వేధిస్తుంటుంది
ఐనా మనం ఎందుకు దాన్ని అందుకోవాలని
అడ్డుకట్ట వెయ్యాలని చూస్తుంటాము ?
అసలేమిటి దానిలోని గొప్పతనం
ఎవరన్నా చెప్పగలరా?
ఈ పరుగెందుకో మనసుకోసం
మనసులో ఆలోచన ఎందు కోసం ?
హ హ హ

మనలోని మనశ్శాంతి ని లేకుండా
చేయటం కోసం లలలలా .....:))

2 comments:

Pranav Ainavolu said...

ఉష గారు,
ఒక మనసులోని ఆలోచనలు ఇంకో మనసుకి తెలుస్తాయ?
నాకు కూడా అచ్చంగా ఇలాంటి సందేహమే వచ్చిందండి.
కాని, ఇప్పుడు ఈ క్షణం... అది నిజమేమో అనిపిస్తుంది.
అదీ మీ కవితలు చదివిన తరువాత.
మీరు వ్రాసిన నా కలత', 'మౌనంగా', 'దీరువు', 'అలిగేవా చందమామా', 'కాలమే చెప్పాలి', 'మన: శాంతి'...
ఇలా ఒక్కొక్కటి చదువుతూ పోతుంటే, అవి అచ్చంగా నా మనోభావాల్లానే ఉన్నాయి.

వీడ్కోలు వేదన కల్పించడానికి స్నేహం ప్రేమగా పరావర్తనం చెందనక్కర్లేదు...
మేఘ తరంగాలపై ఆమె నాలో కలిగించిన ఇన్స్పిరేషన్, ఓదార్పు నా కళ్ళముందు తెరచాపలా వేలాడుతుంది.
కాని, కాలం దాన్ని కబళిస్తుందని తెలియక అలానే చూస్తూ కూర్చున్నాను.
ఆ రోజులు దగ్గర పడ్డాయనిపిస్తుంది... తనకు వాళ్ళింట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట.
స్నేహితురాలి పెళ్ళంటే ఎవరికైనా సంతోషం కలిగించే విషయం... కానీ నాకేంటో - బాధ కలుగుతుంది మరి.
తను నాతొ ఇక మాట్లాడలేదు... కనీసం కనపడదని బాదనా, లేక ఇంకేదైననా?
ఇలా నా ఒక్కడికేనా లేక తనకు కూడా అనిపిస్తుందా?
ఈ మాటలు తనకు చెప్పాలనిపిస్తుంది... కానీ ఇవి తనని బాధిస్తాయేమోనన్న భయంతో ఆగుతున్నాను.
చూపుల్ని చదివే శక్తి తనకుంటే బాగుండు... నాకు ఈ బాధ తప్పేది.
ఈ విషయం తనకు చెప్పలేక, నాలోనే దాచుకోలేక మాధనపడిపోతున్నాను...
అందుకే మౌనం ముసుగు వేసుకొని జీవిస్తున్నాను.

మీ కవితల మీద అభిప్రాయం తెలిపుదామని మొదలు పెట్టి నా జ్ఞాపకాల పుటల్లోకి వెళ్లాను...
ఇదిగో ఇలాగే ఏది ఆలోచించినా అక్కడికే వెళ్తున్నాను...
కధలన్నీ కంచికి చేరినట్టు... దాని దగ్గరకే వచ్చి ఆగుతున్నాయి అన్ని ఆలోచనలు...

మొత్తానికి మీ కవితలతో నన్ను ఒక్కసారి నా గతంలోకి తోన్గిచూసుకునేలా చేసారు.

మీరు ఇలాగే మనసుకు హత్తుకునే కవితలు రాస్తూ అన్దరినీ అలరించేలా చేస్తారని ఆశిస్తూ...

-ప్రణవ్

Pranav Ainavolu said...

మీ బ్లాగ్లోని టపాలు చదువుతుంటే నన్ను నేనే చడువుకున్తున్నట్టు ఉండండి...
స్నేహం విషయంలో కావొచ్చు, ఆలోచనల విషయంలో కావొచ్చు... అన్నీ నేను మనసులో అనుకున్నావే కళ్ళముందు అక్షర రూపంలో సక్షాత్కారమయ్యే సరికి ఒక్కసారి ఏదో వ్యక్తపరచలేని ఆనందం.
ఇన్ని రోజులు, నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారా అనే ఒక సందేహం ఉండేది. ఒకరున్నారని తెలిసి కాస్త ఊరట, ఓదార్పు కలిగింది.

అవును... నిజంగానే మనసుకు తెలియదమనేది ఉంటుందా? అదే నిజమైతే మనసుకు ఎందుకింత క్షోభ, వేదన.
దాని వెంట పడే కొద్ది అది మనల్ని అలా పర్గేట్టిస్తూనే ఉంటుంది. ఇది నిజం.
మీరంటుంటే నిజమేననిపిస్తుంది... మన:శాంతి లేకుండా చేసేందుకే మనసుకి ఈ ఆలోచనలేమో?