Friday, January 11, 2008

ఈరోజు జరిగిన ఒక చిన్ని తమాషా

నా జి మెయిలు లాగ్ ఇన్ అయ్యాను రోజులాగే .[:)]

అంతలో కొత్తపాళీ గారు హూ ఈజు దిస్సు హౌ డూ నో మీ ? అని వోచ్చేసారు చాట్ కి .
సరే ఎటు ఆయనకీ నేను తెలీదు కదా అని ,నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఫలానా ఫలానా బ్లాగర్ ని మీరు నాకు పోస్ట్ కామెంటు కూడా రాసారు అంటూ. ఐతే ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. ఆ కొత్తపల్లి గారు కాస్త కంగారు మహాసయులనుకుంట నేనేంటి మీకు కామెంట్ రాయటమేంటి అని ఒకటే తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇక లాభం లేదని నా బ్లాగ్ లో ఉన్న కొత్తపాళీ గారి కామెంట్ ని కాపీ పేస్టు నా పద్దతిలో పంపించేసా.
ఇంకేముంది నేను అసలు తెలుగు బుక్స్ చదవటమే తక్కువ ఇంకా అందులోను ఇంత సాహిత్యం నా వలన ఎక్కడ అవుతుంది అంటూ. కాని అయన "కొత్తపాళీ" గారు కాదు వేరే ఎవరో "కొత్తపల్లి" గారని అసలు విషయము బయట పెట్టేసరికి అప్పుడు నేను తిన్నాను ఖంగు. "పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టు గా" కాసేపు చాటింగ్ మర్చిపోయా నయ్యం ఆ టైములో నిజమైన కొత్తపాళీ గారు లేరు లేపోతే నా పరిస్తితి ఎలా ఉండేదో కాని నిజంగా ఒకే మెయిలు ఐడి తో ఉంటారా అని ఆలోచిస్తున్నా అలా అని చాటింగ్ ఆపేనా ఆహా లేదే దొరికేరు కదా అని చాటింగు చేస్తున్న "M T V " బకరా దొరికేరు కదా అని కాసేపటికి జ్యోతి గారు ఆన్ లైను కి వోచ్చేరు ఆవిడని అడిగాను నిన్న మీరు ఇచ్చిన ఐడి కొత్తపాళీ గారిదేనా అని అవును ఇప్పుడు నేను వారి మెయిలు చూస్తున్నాను అన్నారు హమ్మా అదేంటి మరి నాకు వేరే కొత్తపాళీ గారు తగిలేరు అండ్ అసలు ఆయన నేను కవినే కాదు అంటున్నారు అని అడిగా పాపం జ్యోతి గారు కుడా కాస్త కంగారు పడినట్టున్నారు అయ్యో నేను కరెక్టు ఐడి ఏ ఇచ్చానే ఇలా ఎలా మారిపోయింది అని అప్పుడు ఆవిడా ఈలో"గా కొత్తపాళీ" కి "కొత్తపల్లి " కి తేడా అర్ధం అయ్యి అసలు విషయం కాస్త సరి చేసారు ఐతే ఈలోగా ఇంకో కొత్త ఫ్రెండు నా జిమైలు లిస్టులో చేరిపోయారు భగవంతుడి దయవల్ల ఆ చేరిన కొత్త ఫ్రెండు మంచి వారే అవ్వడం కొసమెరుపు

ఇదండీ ఈరోజు విశేషం
మరి చదివి మీరంతా ఎలా కామెంటు చేస్తారో ఇక మీ ఇష్టము ఏమంటారు ??
ఉండనా
మీ అందరి అభిమానము సదా ఆశిస్తూ
మీ
ఉష

Wednesday, January 9, 2008

రాత

ఆశించి చూశాను ఎంతో ఆశగా,
ఆశ ఆడియాస చేసింది నా రాతగా
ఎందుకే నీకా ఆశ అని చేసింది గేలిగా,
అందుకే ఆశ పడవద్దంది మనసు జాలిగా..!

అల్లరి

చిన్నతనంలో అల్లరికి అంతముందా
ప్రతి జీవికి అది ఒక మధురానుభూతే కదా
కాదనగలమా వొద్దని అమ్మ మురిపెంగా తిట్టినా
పోనిద్దూ అని నాన్న మురిపాన్ని చూసి
ఇంకా చెలరేగే అల్లరి కి ఆనకట్ట ఎవరేయగలరు
వేసినా ఆగిపోగలమా అల్లరిని వద్దనుకొని
నిలువ గలమా చిట్టి పోట్లాట పోరాడ కుండా ??

నిరాశ

కలలు కనలేదు ఆశలు పెంచుకోలేదు
ఐనా ఎందుకో దొరకలేదు చక్కనీ
బ్రతుకు దొరికిన బ్రతుకుని సంతోషంగా
పంచుకున్దాము అనుకుంటే కలసిరాని తోడు
కలలు కంటేనే బాగున్ను ఏమో అనిపించే మనసుకి
ఇంకేమి కల కంటావు నేస్తమా ఈ చివరి దశలో
అంటూ చేసింది మనసు గేలి వాలింది మది నిరాశా వొడిలో
నిజమేనా అనుకుంటూ సోలిపోయింది నిస్సత్తువగా
ఆపుకోలేని కన్నీటి వరదతో

ఒంటరిని

రాయి లాంటి మనసుకి అయ్యాను తోడు
కాలేకున్నాను నీడ అలా అని ఒదిలి వేల్లలేకున్న
బ్రతుకనే బంధానికి కట్టుబడి కానీ భరించలేకున్నా
ఆ రాతిబరువుని మోసేకోద్ది అవుతుంది భారమే
కాని కాకుంది కాస్తయినా ఆలంబనా ఏమిసేతు
ఎటు పోతు కన్నపేగుని వొదిలి పోలేకున్నా
అలా అని ఈ వొంటి బ్రతుకు ఈధలేకున్నా !!!

ఆనకట్ట

చల్లని గాలిలో కురుల మబ్బులో
వెతికితే దొరికేనా మదిలోని ఊహ
చందురుని నీడలో వెన్నెలా హాయిలో
కలిగేనా మదికి హాయిలాంటి ఆశా
ఏమి చెప్పినా వింటుందా మనసులోని కదలిక
కలిగే ఊహకి వేయగాలమా ఆనకట్టా
తుఫాను తాకిడిలో పొంగే వరద గోదారి లా
ఊగిసలాడే మదికి వేయకుమా అడ్డుకట్టా ..

మనసులో ఘోష

కలిగింది ఒక ఘోష ఆరని జ్వాల లా
పెరిగింది ఒక వేదన కనపడని గోలలా
ఎందుకిలా ఉంటాడు మగడనే మనిషి
రాజుననుకుంటూ నే అవుతున్నాడు రక్కసి
ఎమోచ్చే అతనికి ఆ రాక్షసత్వం లో
తిరిగిరాని మనశాంతి తప్పా
ఐనా అలానే ఉండాలని ఎందుకంత తపనా?
ఎమోచ్చే బతుకులో ఎవరికి కాని ఒంటరి తనం తప్పా
కలిసిమెలిసి ఉంటే కలిగేనే ఆనందం అని తెలిసేనా ఎప్పటికి ఐనా
ఎవరు చెప్పగలరు నాలోని ఈ వేదనా తరంగాన్ని
ఎవరాపగలరు నాలోని ఈ కన్నీటి గాయాన్ని !!!

Tuesday, January 8, 2008

బాధ

ఏముంది జీవితం ఎంతకాలము ఈ ఆవేదన
ఎన్ని రాజకీయ పక్షాలు ఎన్ని కొత్త పార్టీలు
రాదేది ప్రజా జీవనానికి ఆనందమనే ఆశ
రాదేది పెదోల్ల జీవన విధానానికి దిశ
ఏముంది ఎదురు చూపుల నిరాశ లో
అలసి సొలసి వాలి రాలిపోయే చివరి క్షణాలు తప్ప !!!..

Monday, January 7, 2008

తెలీదు

ఎందుకు పుడతామో తెలీదు
ఈ బంధాలు ఎందుకో తెలీదు
కాని ఎందుకు కలుపుకున్నామో తెలీదు
అలా ఎందుకు కలుపుతాడో
చివరికి ఆ దేముడికి కూడా తెలీదు

నేస్తమా

ఎలా కలిసామో తెలిదు కానీ ఉన్నాము కొన్నిరోజులు
స్నేహమనే బంధం లో ఎందుకు మౌనంగా ఉన్నవూ తెలీదు
కాని ఆ మౌనమే సాస్వతమౌతుంది అని అనుకోలేదు ఏనాడు
నీకిదే నా కన్నీటి వీడుకోలు.[:(]

Sunday, January 6, 2008

వేదన

వొద్డన్న వచ్చేవే కన్నీళ్ళు
మనసుకే ఓదార్పు నివ్వాలని
కానీ రమ్మన్న రావు నవ్వులా హరివి ల్లులు
ఏమని చెప్పగలను
నా మనసులోని వేదనా
ఏపాటికీ అన్న తీరేనా ఈ కన్నీటి రోదానా' ...???

ఏమికానా ?

చెప్పనా ఒక చిన్న మాట
చిరు గాలికే కదిలే కురులే కానా,
మల్లెలలో దాగే మంచి సువాసన నే కానా,
తేనెలో దాగిన తీపినే కానా
ఏమో ఎన్ని అనుకున్న ఏమీ కానా?..

చిట్టితల్లి

చూసేకోద్ది చూస్తాము చిట్టి చిట్టి తల్లులని
మనసే పులక రించే ఆ చిన్నారుల ముద్దు
మురిపాలతో ఎన్ని జన్మల భాగ్యమో అని
తల్లి మురిస్తే ఎంత చక్కనమ్మ అని చుట్టూ పక్కల
మురిసి ముద్దాడే చిట్టి తల్లులు ముచ్చట్లు ..!!

చిన్నారి

చిలిపి తగాదాల చిన్నారులతో
కలిగేనే మనకి కంటి నిండా
ఆనంద హేల కాదు కాదు అనురాగ డోలా
ఎన్ని జన్మల పుణ్యమో మనకి
కలిగింది అంత అదృష్టము ..!!

చిలిపిమనసు

జీవితమనేది చిలిపి తనపు అల్లరి ఉండాలి
అనుకుని జీవితము లో ఆనందాలన్ని మనకే
కదా అనుభవించాలి అనుకుని పంచుకొనే మనసుకోసం
ఎదురు చూస్తే ఆ మనసు మనలను కలిస్తే కలిగే
ఆనంద దోలికలతో ఊగిపోదా ఈ చిలిపి మన స్సు!!!..

భావన

ఆశల వేగాన్ని అందుకోలేని నేను
కావ్యాన్ని అందుకో గలనా
సెలయేటి గల గల లో వినిపించే నాదాన్ని వేగాన్ని
చూడగలనా కనిపించే ఒక చిన్ని భవనా నీకు ఇడియే వందనం.!!!

మదిలోని భావం

ఎలా చెప్పగలను నా మనసు లోని వేదన,
తెలిసినా తెలియని ఒక సన్నని ధారగా,
ఊగిసలాదే ఈ చిన్ని జీవితానికి కావలనా,
ఇన్ని ఆలోచనలు చెప్పాలని ఉన్న ఎలా
తెలుప గలదు తన మనసు తనకే అని,!!!!

చిరునగవు

నా నవ్వే నాకు ప్రాణం
నవ్వుతూనే ఉండాలి అని కోరుకుంటాను
అలానే నవ్విస్తూ నే ఉండాలని ఆశిస్తూ ఉంటాను.!!
తెలియని మనసుకి రాని భావం ఉండునా,
కలిగిన ఆ ప్రతి భావనా ఇలలో కలఏన
జరగదని తెలియదా ఓ చిన్ని మనసు
మనసుకి చాలా భావాలు, తెలియనివి,
కొన్ని ఉన్న, తెలిసినవే ఎన్నో కదా .!!!

మాధుర్యం

అధియ్యేమీ భావానో కలిగిన తరువాత,
చెరగని, మారని ,మాధుర్యానుభూతి ఏ,
కదా చిన్ని చిన్ని అబద్దాలు
ఒక్కోసారి మనసుకి కలిగిస్తాయి,
చిరు గిలిగింత మన్శుకే తెలియని,
ఒక పులకింత చెప్పగలవా నేస్తామా!!

చెలిమి

మనసుకి తెలీదా ఒక చిరు కలయిక,
చెప్పలెధా ఆది ఎటు వంటి కలయికో,
తల్లిగా కాదా చెల్లిగా కాదా ,
లేక మనసుకి నచ్చినా మాధుర్య
చిరు స్నేహితురలే కాదా.

స్నేహం

కాదు నేను అంత ఆశుకవిని
చెప్పాలని ఉన్న చేతకాని
చిరు తొలక రిని అవుతనో లేదో
కనిసపు కవయిత్రిని
కోరుకుంటున్న కనీసం మీలాంటి దోస్తుల సహకారాన్ని ..!!!

నీ కోసం

రాయాలని అనుకున్న చిరు కవిత
నీకోసమే
కానీ తట్టుకోలేకున్న ఇక్కడ నా దోస్తుల ధాటికి
అందుకే కాస్త ఆగాలి అనుకున్న నీ పుంపే జవాబుకి
కానీ మిత్రమా ఆగినా ఆగలేదు నీ స్క్రాపుల ధాటి
అందుకే ఇచ్చాను చిన్న స్క్రాపు నీకు బహుమతి ..!!

కన్నీరు

వెలుగుగా మరాలని వచ్చాను నీ మదిలోకి తెలియకనే,

వచ్చిన తరవాత తెలిసి పోతున్నాను ఆ చీకటికే

రాలినా ఒక కన్నీటి బొట్టు ఏమని చెప్పగలదు తనలోని బాధని
చెప్పాలన్నా చెప్పలేని తన దీన గాధని ఎవరిందురమ్మా

నా వెతలని ఎంత చెప్పినా తరగనిది, దాచినా దాగనిది ఎందుకే అంటూ
జారింది కనులనుండి కన్నీరాయె ముత్యమన్న కానే అని..!!!

మనసు

ఛెలి మేలి ముసుగు తీసి బాసలు ఛెప్పాలని కల గన్నాను
కాని ఛెప్పలేని తన్మయత్వమేదొ మనసుని దోఛింది
నాఛెలి నీముసుగుని తీయగ నా మది ఎందుకు కలవరపదుతున్నదొ
నీవైనా ఛెప్పగలవా అని అనుకున్నా గాని ఛెప్పలెని భావనే నను
నీ ఛెంతకు ఛేరమని తొందర ఛెసింది