Monday, January 14, 2008

నా మనసు లో ....

చిన్ననాటి ప్రేమలు మిగలలేదు అన్నదమ్ముల అక్కచెల్లల్ల మధ్య ,
స్నేహితులెక్కడో కలలో కుడా మిగలలేదు,
జీవితపు బంధాలు తెచ్చే రోదనల దారి లో,
వెతుక్కున్న దొరకలేదు నవ్వులా దారి ,
ఎందుకు పుట్టానో తెలియకుండా ఉంది,
ఎందుకు మిగిలేనో అర్ధము కాకుండా ఉంది,
ఐనా బ్రతుకు బండి నడుస్తూనే ఉంది అనుకున్న
తరుణంలో దొరికింది ఒక చెలిమి ఆనంద తరంగం లా
మిగలాలని కలకాలం కోరుకుంటున్నా నేస్తమా
నను మరచిపోనని మాటివ్వగలవా?
సరివయస్సుకాదని మరచిపోతావేమో అని అడగలేకున్నా,
అడగకుండా ఉండలేకున్నా !!
ఏమి చేతు నీవే చెప్పుమా నా ప్రియనేస్తామా .......

4 comments:

రాధిక said...

ఈ కాలంలో ఒక్క డబ్బు గురించే బ్రతుకుతున్నాము.అమ్మానాన్నా,అక్కాచెల్లీ,అన్నాతమ్ముడూ ఏ బంధాలు అక్కర్లేదు.పండుగకు పబ్బానికి ఫోనులు చేసి, తెచ్చిపెట్టుకున్న ఆప్యాతలు కురిపించి,ఏ మూడేళ్ళకో కలిసినప్పుడు కానుకలు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడమే.మూడు మేడలు కట్టాము,నాలుగు కార్లు కొన్నాము అని చెప్పుకోవడం లో వున్న ఆనందం నాకో మంచి ఫ్రెండ్ వున్నాడు/వుంది అని చెప్పుకోవడం లో పొందట్లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తూ వుంటుంది మనము సంఘం తోను,సంఘం డబ్బుతోను ముడిపడివుందని.ఎక్కడా కుటుంబం,ఆప్యాయతలు,స్నేహాలు అనే పదాలే కనిపించవు.ఇంకొన్ని రోజుల్లో పిల్లల కోసమే కుటుంబమనే వ్యవస్త ఏర్పడుతుంది.[ఈ కామెంటు ఈ ఒక్క కవిత గురించి కాదు మీ కవితలన్నీ చదివిన ఆవేశంలో రాసాను.]

Rajani Kumar Sindavalam said...

Mi kavithalu vasthava paristhuthulaku addam paduthunnayandi.

really good.

But rachika garu chesina comment chusaka,naku oka vishayam cheppali ani anipinchindhi.

"Bandham,bhandavyam,chuttarikam,sneham.... anni mana manasu alochinche dani batti vuntundhi.

manam tappu chesthu...sanghanni tappu pattatam tappu ani na bhavam.

sangham kosam bratakali ante...bandhalani vadileyyali ani kadhu kadhandi...."

Usha said...

Srinu gaaru chalaa santhosham andi meeku impressiv gaa anipinchinanduku but meeku direct gaa reply elaa ivvalo telika ikkada istunna andi

thanks
Usha

http://usha-poetry.blogspot.com/

Usha said...

నమస్తే సుమన్ గారు ఏ కమ్యునిటి లో చుసారో గుర్తు ఉందా
పోనిలెండి ఎనీ హావ్ చాలా సంతోషంగా ఉంది మీకు నా కవితలు చాలా నచ్చినందుకు
మీరు ఎలా రిప్లై ఇవ్వాలో తెలియక ఇక్కడ ఇస్తున్నాను కాజ్ మీ బ్లాగు కానీ మీ ID కాని తెలివు గా అందుకే
థాంక్స్ అండి
ఉష