ముందు తెలియదు నీ పరిచయం
ఎలా మారుతుందో కాని
మారేవు ఈరూపం గా
కలలోలా కలిసేవు
కన్నులలో నిలుస్తున్నావు
కరిగిపోతావు అని తెలుసు
ఐనా ఆశ పడుతున్నాను
ఎందుకో తెలీదు మరువలేకున్నాను
మార్చుకోలేకున్నాను
తనువర్పించాలని ఉన్నా
మనసు మాత్రమే ఇవ్వగలను
ఎందుకు కలిశావు
చివరికి ఇలా వొదిలి పోవలనా..
నను వీడిపోయే తరుణం ఉందన్న నిజం
తెలిసి కుడా వోదలలేని ఈ స్థితికి తెచ్చేవు
ఏమయిపోతానో నాకే అర్ధం కాకున్నది
ఏమికానని మనసు మొండిగా చెప్తున్నది
ఏదైనా కాలమే చెప్తుంది చివరకు
Tuesday, February 5, 2008
Monday, February 4, 2008
మధుర బంధమా
మాట్లాడకు అన్నంత మాత్రాన
మరిచి పోతానని అనుకున్నావా ...
మరు జన్మకై నేను వేచి యున్నాను.
మిగిలిన ఈ రోజులు మ్రింగ లేకున్నాను.
ముచ్చటైన మన కలయిక మరువలేకున్నాను..
నేను నిన్ను మరువలేను.
మరువలేని నేస్తమా
జన్మల బంధానికి ఎదురు చూపు తప్పదమ్మా
మాటలే లేనప్పుడు మౌనమే భాషా
అందుకే ఈ మౌనం అంటున్నా
కాదనలేవు గా మధుర బంధమా
మరిచి పోతానని అనుకున్నావా ...
మరు జన్మకై నేను వేచి యున్నాను.
మిగిలిన ఈ రోజులు మ్రింగ లేకున్నాను.
ముచ్చటైన మన కలయిక మరువలేకున్నాను..
నేను నిన్ను మరువలేను.
మరువలేని నేస్తమా
జన్మల బంధానికి ఎదురు చూపు తప్పదమ్మా
మాటలే లేనప్పుడు మౌనమే భాషా
అందుకే ఈ మౌనం అంటున్నా
కాదనలేవు గా మధుర బంధమా
Sunday, January 27, 2008
నీకే ఒదిలేస్తున్నా
చిలిపి గా మొదలయిన చిరు స్నేహం
అయ్యింది మెల్లగా మాధుర్యాలా మమతల లోకం
పలకరింతల పెనవేత లో
మారింది మరో రూపం
అని భ్రమసే లోగా చివరికి రానుంది
వీడిపోయే తరుణం
ఏమో ఏమగునో చివరికి ఈ అనుబంధం
స్నేహమనే బంధం గా మిగులునో
లేక అపరాధిగా నను నిలుపునో
ఒహ్ అందుకే నేస్తమా
నాలోనే దాచుకున్నా నా భావం
కాని నను బలవంత పెట్టి
వెలికి తీసేవు నాలోని దుఖం
విని అయ్యావు చివరికి నాకు దూరం
కాని మరువలేను నిను కలకాలం
కాను దూరం అని ఒదారుస్తావో
లేక ఇలా నను ఒదిలేస్తావో
నీకే ఒదిలేస్తున్నా నిర్ణయం
అయ్యింది మెల్లగా మాధుర్యాలా మమతల లోకం
పలకరింతల పెనవేత లో
మారింది మరో రూపం
అని భ్రమసే లోగా చివరికి రానుంది
వీడిపోయే తరుణం
ఏమో ఏమగునో చివరికి ఈ అనుబంధం
స్నేహమనే బంధం గా మిగులునో
లేక అపరాధిగా నను నిలుపునో
ఒహ్ అందుకే నేస్తమా
నాలోనే దాచుకున్నా నా భావం
కాని నను బలవంత పెట్టి
వెలికి తీసేవు నాలోని దుఖం
విని అయ్యావు చివరికి నాకు దూరం
కాని మరువలేను నిను కలకాలం
కాను దూరం అని ఒదారుస్తావో
లేక ఇలా నను ఒదిలేస్తావో
నీకే ఒదిలేస్తున్నా నిర్ణయం











