నా జి మెయిలు లాగ్ ఇన్ అయ్యాను రోజులాగే .[:)]
అంతలో కొత్తపాళీ గారు హూ ఈజు దిస్సు హౌ డూ నో మీ ? అని వోచ్చేసారు చాట్ కి .
సరే ఎటు ఆయనకీ నేను తెలీదు కదా అని ,నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఫలానా ఫలానా బ్లాగర్ ని మీరు నాకు పోస్ట్ కామెంటు కూడా రాసారు అంటూ. ఐతే ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. ఆ కొత్తపల్లి గారు కాస్త కంగారు మహాసయులనుకుంట నేనేంటి మీకు కామెంట్ రాయటమేంటి అని ఒకటే తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇక లాభం లేదని నా బ్లాగ్ లో ఉన్న కొత్తపాళీ గారి కామెంట్ ని కాపీ పేస్టు నా పద్దతిలో పంపించేసా.
ఇంకేముంది నేను అసలు తెలుగు బుక్స్ చదవటమే తక్కువ ఇంకా అందులోను ఇంత సాహిత్యం నా వలన ఎక్కడ అవుతుంది అంటూ. కాని అయన "కొత్తపాళీ" గారు కాదు వేరే ఎవరో "కొత్తపల్లి" గారని అసలు విషయము బయట పెట్టేసరికి అప్పుడు నేను తిన్నాను ఖంగు. "పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టు గా" కాసేపు చాటింగ్ మర్చిపోయా నయ్యం ఆ టైములో నిజమైన కొత్తపాళీ గారు లేరు లేపోతే నా పరిస్తితి ఎలా ఉండేదో కాని నిజంగా ఒకే మెయిలు ఐడి తో ఉంటారా అని ఆలోచిస్తున్నా అలా అని చాటింగ్ ఆపేనా ఆహా లేదే దొరికేరు కదా అని చాటింగు చేస్తున్న "M T V " బకరా దొరికేరు కదా అని కాసేపటికి జ్యోతి గారు ఆన్ లైను కి వోచ్చేరు ఆవిడని అడిగాను నిన్న మీరు ఇచ్చిన ఐడి కొత్తపాళీ గారిదేనా అని అవును ఇప్పుడు నేను వారి మెయిలు చూస్తున్నాను అన్నారు హమ్మా అదేంటి మరి నాకు వేరే కొత్తపాళీ గారు తగిలేరు అండ్ అసలు ఆయన నేను కవినే కాదు అంటున్నారు అని అడిగా పాపం జ్యోతి గారు కుడా కాస్త కంగారు పడినట్టున్నారు అయ్యో నేను కరెక్టు ఐడి ఏ ఇచ్చానే ఇలా ఎలా మారిపోయింది అని అప్పుడు ఆవిడా ఈలో"గా కొత్తపాళీ" కి "కొత్తపల్లి " కి తేడా అర్ధం అయ్యి అసలు విషయం కాస్త సరి చేసారు ఐతే ఈలోగా ఇంకో కొత్త ఫ్రెండు నా జిమైలు లిస్టులో చేరిపోయారు భగవంతుడి దయవల్ల ఆ చేరిన కొత్త ఫ్రెండు మంచి వారే అవ్వడం కొసమెరుపు
ఇదండీ ఈరోజు విశేషం
మరి చదివి మీరంతా ఎలా కామెంటు చేస్తారో ఇక మీ ఇష్టము ఏమంటారు ??
ఉండనా
మీ అందరి అభిమానము సదా ఆశిస్తూ
మీ
ఉష
Friday, January 11, 2008
Wednesday, January 9, 2008
రాత
ఆశించి చూశాను ఎంతో ఆశగా,
ఆశ ఆడియాస చేసింది నా రాతగా
ఎందుకే నీకా ఆశ అని చేసింది గేలిగా,
అందుకే ఆశ పడవద్దంది మనసు జాలిగా..!
ఆశ ఆడియాస చేసింది నా రాతగా
ఎందుకే నీకా ఆశ అని చేసింది గేలిగా,
అందుకే ఆశ పడవద్దంది మనసు జాలిగా..!
అల్లరి
చిన్నతనంలో అల్లరికి అంతముందా
ప్రతి జీవికి అది ఒక మధురానుభూతే కదా
కాదనగలమా వొద్దని అమ్మ మురిపెంగా తిట్టినా
పోనిద్దూ అని నాన్న మురిపాన్ని చూసి
ఇంకా చెలరేగే అల్లరి కి ఆనకట్ట ఎవరేయగలరు
వేసినా ఆగిపోగలమా అల్లరిని వద్దనుకొని
నిలువ గలమా చిట్టి పోట్లాట పోరాడ కుండా ??
ప్రతి జీవికి అది ఒక మధురానుభూతే కదా
కాదనగలమా వొద్దని అమ్మ మురిపెంగా తిట్టినా
పోనిద్దూ అని నాన్న మురిపాన్ని చూసి
ఇంకా చెలరేగే అల్లరి కి ఆనకట్ట ఎవరేయగలరు
వేసినా ఆగిపోగలమా అల్లరిని వద్దనుకొని
నిలువ గలమా చిట్టి పోట్లాట పోరాడ కుండా ??











