Thursday, February 28, 2008

అందమైన చేదు లాంటి జీవితము

కలలు లేవు కన్నుల్లొ కలతలు తప్ప
మరులు లేవు మనసు పొరల్లొ
మాయని గాయాలు తప్ప
తీపి గురుతులు లేవు మనువులొ
చేదు అనుభూతులు తప్ప
పరిధులు లేవు నా బ్రతుకుకి
వేయాలనిపించదు అడ్డుకట్ట
సాగిపొయే జీవితానికి ఆపాలనిపించదు
అనుభూతుల ఆనకట్ట
తెరచాటు చేయలేను ఆలొచనల ఆవేసానికి
చేయాలని చూసేకొలది పొంగే నదికన్నా
దూకే కెరటములా ఎగిసిపదుతుంటె
ఎలా ఆపగలను
ఆపినకొద్దీ కట్టుతెంచుకున్న
నదిలా నను ముంచేస్తుంటే
మునిగే శక్తి లేని ఆశక్తురాలనయ్యాను

3 comments:

pruthviraj said...

నమస్కారమండి ఉషా గారు. నా బ్లాగు ఏర్పాటు కు మీ సహాయం మరిచి పోలేను. ఇంకనూ మీ కవితలకు కామెంట్ రాసేంత వాడిని కాదు. ఏమైనా ఉంటే అక్క్షర దోషాలు. ఇంకా అంటే పై కవిత భావస్పష్టత నాకు బోధ పడలేదు.సందర్భ చిహ్నాలు ఉంటే బాగుండును.కానీ, కవిత గాఢత నాకు నచ్చింది.
మీ

www.pruthviart.blogspot.com

pruthviraj said...
This comment has been removed by the author.
Kathi Mahesh Kumar said...

"పరిధులు లేవు నా బ్రతుకుకి, వేయాలనిపించదు అడ్డుకట్ట
సాగిపొయే జీవితానికి ఆపాలనిపించదు, అనుభూతుల ఆనకట్ట"

ఇదేనా మీరు చెప్పింది? లెక ఈ క్రింద దా?

"పరిధులు లేవు నా బ్రతుకుకి.
వేయాలనిపించదు అడ్డుకట్ట సాగిపొయే జీవితానికి.
ఆపాలనిపించదు అనుభూతుల ఆనకట్ట."