Thursday, March 6, 2008

తడి కనులకి వెచ్చని ఆశ

కన్నీటి తడి కనులకి తెలిసినా ,
చెప్పలేని మనసు ని ఊరడించలేదు,
హద్దులను దాటి రాలేని మనసు
తడికన్నులని చూసి ఏడవలేక
నవ్వే నా సమాధానం అని తెలిపితే
మూగగా చూసే నీ చూపే
నా తడి కనులకి వెచ్చని ఆశ
అని చిరునవ్వుతో చూసే కన్నీటిని
ఏమని అడగగలదు మూగ మనసు

6 comments:

pruthviraj said...

చాలా చాలా బాగున్నది..

రాధిక said...

good one.

rakee said...

Do you still use free service like blogspot.com or wordpress.com but
they have less control and less features.
shift to next generation blog service which provide free websites for
your blog at free of cost.
get fully controllable (yourname.com)and more features like
forums,wiki,CMS and email services for your blog and many more free
services.
hundreds reported 300% increase in the blog traffic and revenue
join next generation blogging services at www.hyperwebenable.com
regards
www.hyperwebenable.com
j

prathap said...

yentho goppa aardraani arthavantha mga chiinnii maatalatho yentho pedda bhava sakyathaa mee kalam sontham.

yinthati goppa kavitha kala hrudayaanikii kalalavedanaa leka
haardhika hrudaya spandana.............!
yedi yemainaa mee gamyam yetuvunnaaa...........
manchi manasu vunna meeku.....!
kammati mee swapnaalu sathyaalai mee yeduta nilavaalai ani
chakkati chirunavvula virijallulu mee madi mungita kuravaalaniii manassara aa devadevuni praardhisthuuu..........!
selava mariii

Bolloju Baba said...

గొలుసుకట్టులా సాగిన మీకవిత అద్భుతం.
ఇలా రాసేటప్పుడు కొండొకచో లింకులు కట్ అయిపోయి మధ్యలోకి అయోమయం దూరిపోతుంది. కానీ మీ కవితలో లింకులు తెగకుండా భావం స్ఫష్టంగా అర్ధమవుతున్నది.

కన్నీటి తడి చెంపలకు తెలియటం వచనం - కనులకు తెలియటం కవిత్వం.

తను కూడా భాధపడలేక మనసు నవ్వుని సమాధానమివ్వటం మంచి ఊహ.

మంచి భావాలను చిన్నవ్యాక్యాలలో అస్ఫష్టత లేకుండా కవితలో పొదగటం బాగుంది

బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

కవితల్ని ఈ మధ్యకాలంలో బ్లాగుల పుణ్యమా అని ఆస్వాదించడం మొదలుపెట్టా. ఈ రోజే (బొల్లోజు)బాబాగారి బ్లాగు ద్వారా మీ లింకు దొరికింది.

మీ ఈ కవిత చదిన వెంఠనే, "చాలా మంచి ఉదయం లభించింది, ఇక పూర్తి రోజుకు ఢోకా ఉండదు" అనిపించింది. ఇంగ్లీషులో అంటారుగా "you (your poem) made my day" అంతే!