Friday, June 6, 2008

మండే ఆహ్లాదం

మండే వేసవిలో అనుకోకుండా
పిల్లతెమ్మెరలా వీస్తున్న చిరుగాలిని
ఆస్వాదిద్దామని ఆనందపడుతూ
ఆరుబయటకొస్తే
వెన్నంటి కర్కసి నన్ను చుట్టింది
మాటల తూటాలతో
హాయి కాస్తా పోయి మది కలతలో పడిపోతే
మూగపోయిన మనసుకు ఆహ్లాదం ఎందుకంటూ
ఎప్పటిలా బాధ హృదిలోనే దాగిపోయింది
అది చూసి తెమ్మెర నేనేన్దుకంటూ
తీరవు ఎందుకు నీకు ఇటువంటి చిరు ఆశలు
అని తెలిసీ ఎందుకు నీ మనసుకు ఈ భావావేశాలు
అంటూ సాగిపోయింది సుదూర తీరాలలోకి
మిగిలిపోయింది ఎప్పటిలా నాలోని నా నిరాశ

2 comments:

Unknown said...

bhavam lo ni mee aavesam baavundi..mee title chakkaga kudirindi....

pruthviraj said...

హాయ్ అండీ..కవిత బావుంది. మీరు మనసులోని ఆనందం ను ఆవేదనను ప్రకృతి లొని అంశాలను పోలుస్తూ కవితలు అల్లుతున్నారు, నేచురల్ గా బావుంటున్నాయి. ఇంకా మంచి కవితలను ఎన్నో త్వరలో అందించగలరని ఆశిస్తున్నాను.