Tuesday, June 10, 2008

మనసు లో ఊహ

ఏ గానం విన్నా మనసు కోరుతుంది
ఒ గాయనిలా పాడాలని
ఏ నాట్యం చూసినా తనువు పులకిస్తుంది
నాట్య మయూరి లా ఆడాలని
ఏ చిలిపి చేతలు చూసినా
మనసు ఊహిస్తుంది
కన్నెలామారిపోవాలని
ఏవి లేని రాని తీరని మోడుకి
రాదిక ఈ జన్మకి ఈ ఆనందలహరి

Friday, June 6, 2008

మండే ఆహ్లాదం

మండే వేసవిలో అనుకోకుండా
పిల్లతెమ్మెరలా వీస్తున్న చిరుగాలిని
ఆస్వాదిద్దామని ఆనందపడుతూ
ఆరుబయటకొస్తే
వెన్నంటి కర్కసి నన్ను చుట్టింది
మాటల తూటాలతో
హాయి కాస్తా పోయి మది కలతలో పడిపోతే
మూగపోయిన మనసుకు ఆహ్లాదం ఎందుకంటూ
ఎప్పటిలా బాధ హృదిలోనే దాగిపోయింది
అది చూసి తెమ్మెర నేనేన్దుకంటూ
తీరవు ఎందుకు నీకు ఇటువంటి చిరు ఆశలు
అని తెలిసీ ఎందుకు నీ మనసుకు ఈ భావావేశాలు
అంటూ సాగిపోయింది సుదూర తీరాలలోకి
మిగిలిపోయింది ఎప్పటిలా నాలోని నా నిరాశ

Thursday, March 6, 2008

తడి కనులకి వెచ్చని ఆశ

కన్నీటి తడి కనులకి తెలిసినా ,
చెప్పలేని మనసు ని ఊరడించలేదు,
హద్దులను దాటి రాలేని మనసు
తడికన్నులని చూసి ఏడవలేక
నవ్వే నా సమాధానం అని తెలిపితే
మూగగా చూసే నీ చూపే
నా తడి కనులకి వెచ్చని ఆశ
అని చిరునవ్వుతో చూసే కన్నీటిని
ఏమని అడగగలదు మూగ మనసు