Thursday, March 6, 2008

తడి కనులకి వెచ్చని ఆశ

కన్నీటి తడి కనులకి తెలిసినా ,
చెప్పలేని మనసు ని ఊరడించలేదు,
హద్దులను దాటి రాలేని మనసు
తడికన్నులని చూసి ఏడవలేక
నవ్వే నా సమాధానం అని తెలిపితే
మూగగా చూసే నీ చూపే
నా తడి కనులకి వెచ్చని ఆశ
అని చిరునవ్వుతో చూసే కన్నీటిని
ఏమని అడగగలదు మూగ మనసు

Thursday, February 28, 2008

అందమైన చేదు లాంటి జీవితము

కలలు లేవు కన్నుల్లొ కలతలు తప్ప
మరులు లేవు మనసు పొరల్లొ
మాయని గాయాలు తప్ప
తీపి గురుతులు లేవు మనువులొ
చేదు అనుభూతులు తప్ప
పరిధులు లేవు నా బ్రతుకుకి
వేయాలనిపించదు అడ్డుకట్ట
సాగిపొయే జీవితానికి ఆపాలనిపించదు
అనుభూతుల ఆనకట్ట
తెరచాటు చేయలేను ఆలొచనల ఆవేసానికి
చేయాలని చూసేకొలది పొంగే నదికన్నా
దూకే కెరటములా ఎగిసిపదుతుంటె
ఎలా ఆపగలను
ఆపినకొద్దీ కట్టుతెంచుకున్న
నదిలా నను ముంచేస్తుంటే
మునిగే శక్తి లేని ఆశక్తురాలనయ్యాను

Tuesday, February 19, 2008

దేవా నీ తీర్పేంటి

కనలేదు ఏ తియ్యని కమ్మని కలలు

కోరుకోలేదు అతిగా ఏ కోరికలు

చిరు ప్రేమ తో నన్ను నన్ను గా ప్రేమించే చిన్ని మనసున్న

మనిషి ఆయితే చాలు అనుకున్నా

ఓ భగవంతుడా అది కూడా అందుకోడానికి తగనా

సరే లే నా అదృస్ఠము ఇంతే అని సరి పెట్టుకుంటున్నా

కూడా ఇంకా నన్ను ఎందుకిలా ఏడిపించాలని

నీకు ఇంత ఆనందము ఆది నా పూర్వాజన్మ లో

చేసుకున్నపాపము అని సరిపెట్టుకోవాలి

అంతే నా ఇదే నా నీ తీర్పు దేవా

దీనికి ముగింపు నా అంతమేనేమో

ఇదేనా నువ్వు చేసే తీర్పు ?